Chiranjeevi: రేపు రాజమండ్రికి వెళుతున్న చిరంజీవి!

Chiranjeevi going to Rajahmundry tomorrow
  • అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరంజీవి
  • డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల వద్ద విగ్రహం ఏర్పాటు
  • వైసీపీ, జనసేన పార్టీల మధ్య వివాదం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరు పర్యటన
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. క్రమం తప్పకుండా ఆయన సినిమాలు విడుదల అవుతూ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. మరోవైపు బిజీ లైఫ్ నుంచి ఆయన చిన్న బ్రేక్ తీసుకోనున్నారు. రేపు రాజమండ్రికి ఆయన వెళ్లనున్నారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దివంగత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి విచారాన్ని వ్యక్తం చేశారని మంత్రి పేర్ని నాని నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిరంజీవి రాజమండ్రి పర్యటన మరికొంత ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi
Tollywood
Rajahmundry

More Telugu News