Narendra Modi: వచ్చేవారం ప్రధాని ఉత్తరాఖండ్ పర్యటన?

PM Modi To Likely Visit Uttarakhand In October Ahead Of Polls Next Year
  • మోదీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ కూడా
  • కేదార్‌నాథ్ సందర్శించనున్న మోదీ, మాండవీయ
  • వచ్చే ఏడాది ఎన్నికల ముందు కీలకం కానున్న పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటన సందర్భంగా కొన్ని కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

మోదీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ కూడా ఉత్తరాఖండ్‌ పర్యటనలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరి పర్యటన రాష్ట్రంలో పార్టీకి మంచి బూస్ట్ ఇస్తుందని, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని గుర్తుచేసినట్లు ఉంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా కేదార్‌నాథ్‌ను కూడా మోదీ దర్శించుకోనున్నారట. అయితే ఈ పర్యటనపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు. దీనిపై వచ్చే రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Narendra Modi
Prime Minister
Uttarakhand

More Telugu News