నాగచైతన్యను నేను ముద్దు పెట్టుకోలేదు: సాయిపల్లవి

29-09-2021 Wed 20:06
  • తొలి నుంచి ముద్దు సన్నివేశాలకు నేను దూరం
  • నాకు ఇష్టం లేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదు
  • ముద్దు పెట్టినట్టు ఒక కెమెరా యాంగిల్ ద్వారా కెమెరామెన్ చూపించారు
I did not kissed Naga Chaitanya clarifies Sai Pallavi
నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన 'లవ్ స్టోరీ' చిత్రం మంచి టాక్ సాధించింది. ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు సైతం పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలి వస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకు సాయిపల్లవి ముద్దుపెట్టే సన్నివేశం ఉంది. వాస్తవానికి ముద్దు సన్నివేశాలకు సాయిపల్లవి దూరంగా ఉంటుంది. ఇంత వరకు ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించలేదు. ఇదే అంశంపై ఓ యూట్యూబ్ ఛానల్ తో సాయిపల్లవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని సాయిపల్లవి తెలిపారు. ఇలాంటి సన్నివేశాలకు తాను తొలి నుంచి దూరమని చెప్పారు. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని అన్నారు. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు పెట్టుకోలేదని... అది కెమెరామెన్ గొప్పదనమని చెప్పారు. తాను నిజంగా ముద్దు పెట్టినట్టుగా కెమెరా యాంగిల్ పెట్టి చూపించారని తెలిపారు.