రవితేజ విడుదల చేసిన 'పెళ్లిసందD' లిరికల్ సాంగ్!

29-09-2021 Wed 17:17
  • రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD'
  • కథానాయికగా శ్రీలీల పరిచయం
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • అక్టోబర్ 15వ తేదీన విడుదల
Pelli Sandadi lyrical song released
గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఈ సినిమాతో కథానాయికగా శ్రీలీల పరిచయమవుతోంది. ఆర్కే అసోసియేషన్ .. ఆర్కా మీడియా వారు ఈ సినిమాను నిర్మించారు. అందమైన ఈ ప్రేమకథను, దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి రవితేజ చేతుల మీదుగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయించారు. 'మధురానగరిలో యమునా తటిలో .. మురళీ స్వరములే మురిసిన ఎదలో' అంటూ ఈ పాట సాగుతోంది. కీరవాణి సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీనిధి .. నయన నాయర్ .. కాలభైరవ ఆలపించారు. శ్రీనిధి వాయిస్ లోని ప్రత్యేక మనసులను పట్టేస్తుంది.

చంద్రబోస్ చేసిన పదప్రయోగాలు ఆకట్టుకుంటున్నాయి. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన రాఘవేంద్రరావు మార్కు, పాట చిత్రీకరణలో కనిపిస్తూనే ఉంది. రోషన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి..