Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి...ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం

Two vehicles in Pawan Kalyan convoy hit each other
  • డీజీపీ కార్యాలయం సమీపంలో ప్రమాదం
  • పవన్ కాన్వాయ్ లోని రెండు వాహనాల ఢీ
  • పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్  
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే... కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.

మరోవైపు జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సినీరంగ సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. దీనికి తోడు సినీ నటుడు పోసాని కూడా పవన్ పై విమర్శలు గుప్పించడం, జగన్ ను ఏమైనా అంటే ఊరుకోబోమని హెచ్చరించడం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన చేపట్టారు.
Pawan Kalyan
Jagan
Convoy
Vehicles
Accident

More Telugu News