పవన్ కల్యాణ్‌-పోసాని వివాదంపై వెరైటీగా స్పందించిన నాగ‌బాబు!

29-09-2021 Wed 13:39
  • ఇన్‌స్టాలో నాగబాబు చాటింగ్
  • పోసానిపై స్పందించాల‌ని అడిగిన నెటిజన్లు
  • గ‌తంలో ప‌వ‌న్ ను పోసాని పొగిడిన విష‌యాన్ని గుర్తు చేసిన నాగ‌బాబు
  • ఓ సినిమా సీన్‌లో పోసానిని ప‌వ‌న్ చెంప దెబ్బ కొట్టిన సీన్ పోస్ట్
nagababu slams posani
జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణ ముర‌ళీ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో దీనిపై నాగ‌బాబు స్పందించారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న‌ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు స‌మాధానం ఇచ్చారు. ఇందులో చాలామంది పోసాని గురించే అడ‌గ‌డం గ‌మ‌నార్హం. ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానంగా  గ‌తంలో ప‌వ‌న్‌పై ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన వీడియోను నాగ‌బాబు పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్‌ హీరోగా చేస్తానంటే తాను ఆయనకి బ్లాంక్‌ చెక్‌ ఇస్తాన‌ని, రూ.40 కోట్లైనా నేను పవన్ కల్యాణ్‌కి ఇస్తాన‌ని పోసాని ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'అంత‌గా ఎందుకు ఇస్తానంటే, ప‌వ‌న్ అంత డిమాండ్‌ ఉన్న హీరో' అని పోసాని అన్నారు. దేశంలో టాప్ హీరోల్లో ఆయ‌న ఒక‌ర‌ని చెప్పారు. రూ.5 కోట్లు లేక‌ రూ.10 కోట్ల కోసం ఆయన పిచ్చి పిచ్చి పనులు చేయడని త‌న‌కు తెలుసని అన్నారు. ఈ వీడియోనే నాగ‌బాబు పోస్ట్ చేశారు.

అలాగే, అత్తారింటికి దారేది సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ ఏద‌ని ఓ నెటిజ‌న్ అడిగాడు. దీనికి నాగ‌బాబు స్పందిస్తూ ఆ సినిమాలో పోసానిని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెంప‌దెబ్బ కొట్ట‌గా ఆయ‌న ప‌న్ను ఊడిపోయే సీనును పోస్ట్ చేశారు.

ఏపీలో సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో అమ్ముతామ‌ని చెబుతోన్న ప్ర‌భుత్వ తీరుపై అభిప్రాయమేమిటని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దీంతో ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ-బ్రహ్మానందం చోరీ చేసిన‌ డబ్బును పంచుకునే సీనును నాగ‌బాబు పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల రిప‌బ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడు‌క‌లో చేసిన వ్యాఖ్య‌లు, శివమణి జాస్‌ కొట్టినట్టు,  జాకీర్‌ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ ఇచ్చినట్టు ఉన్నాయ‌ని నాగ‌బాబు అన్నారు.