'నాట్యం' నుంచి వెంకీ రిలీజ్ చేసిన సాంగ్!

29-09-2021 Wed 10:59
  • 'నాట్యం' చుట్టూ తిరిగే కథ 
  • ప్రధానమైన పాత్రలో సంధ్యా రాజు 
  • దర్శకుడిగా రేవంత్ కోరుకొండ 
  • అక్టోబర్ 22వ తేదీన విడుదల  
 New song released from Natyam movie
'నాట్యం' చుట్టూ తిరిగే ప్రధానమైన కథతో గతంలో 'స్వర్ణకమలం' సినిమా వచ్చింది. ప్రేక్షకుల హృదయాలపై ఆ సినిమా గాఢమైన ముద్రవేసింది. ఇప్పటికీ ఆ సినిమాను ఎవరూ మరిచిపోలేదు. ఆ తరహాలో మళ్లీ ఇంతకాలానికి వచ్చిన సినిమాగా 'నాట్యం' కనిపిస్తోంది.

సంధ్యారాజు కూచిపూడి నాట్యకళాకారిణి. తన అభిరుచికి తగినట్టుగా ఆమె ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సాంగ్ అన్నిటికీ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి వెంకటేశ్ చేతుల మీదుగా ఒక సాంగును రిలీజ్ చేయించారు.

'పోనీ పోనీ ఈ ప్రాణమే .. కళకై జరిగే ఓ త్యాగమే, ప్రేమే చిందించే రక్తమే .. కళకందించే ఆరాధనే' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రావణ్ భరద్వాజ్ బాణీకి .. కరుణాకర్ అడిగర్ల సాహిత్యాన్ని అందించగా, లలిత కావ్య ఆలపించారు. ఆవేదనా భరితమైన గీతం ఇది.  అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.