Kalyan dhev: ఆసక్తిని పెంచిన 'కిన్నెరసాని' లిరికల్ సాంగ్!

Kinnerasani movie update
  • కల్యాణ్ దేవ్ హీరోగా 'కిన్నెరసాని'
  • దర్శకుడిగా రమణ తేజ్ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా 'కిన్నెరసాని' సినిమా రూపొందుతోంది. రమణతేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. రజనీ తాళ్లూరి .. రవి చింతల నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'దారికాని దారిలోన .. 'అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ అందించిన బాణీకి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించాడు. జాతర పాట తరహాలో ఈ పాట సాగింది. ఈ పాట బీట్ బాగానే ఉన్నప్పటికీ .. సాహిత్యం పరంగా చూసుకుంటే, అర్థం చేసుకోవడానికి కొంతసేపు ఆలోచన చేయవలసి వస్తుంది.

'పార్వతీపురం' అనే ఊరు తనని తాను పరిచయం చేసుకుంటూనే కథలోకి వెళుతుంది. అయితే అందుకోసం వాడిన పదాలు పెద్దగా తెలిసినవి కాకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. ఏదేవైనా ఈ పాటతో ఈ సినిమాలో మరో కోణం ఉందనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Loading...

More Telugu News