సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

29-09-2021 Wed 07:30
  • 'బీస్ట్' షూటింగులో జాయిన్ అయిన పూజ
  • దసరా రోజున పవన్ కొత్త సినిమా లాంచ్
  • యాక్షన్ హీరోగా రానున్న ప్రభు దేవా  
Pooja Hegde joins Beast shoot in Chennai

*  ఓపక్క తెలుగు సినిమాలు.. మరోపక్క హిందీ సినిమాలు చేస్తూ బిజీగా వున్న అందాలతార పూజ హెగ్డే.. ఇంకోపక్క 'బీస్ట్' అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. కాగా, పూజ హెగ్డే  నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది.
*  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో 'భవదీయుడు.. భగత్ సింగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగును విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15న లాంఛనంగా ప్రారంభించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని సమకూర్చనున్నాడు.
*  ప్రభుదేవా తొలిసారిగా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శ్యామ్ రోడ్రిగ్యూస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ఇటీవలే చెన్నైలో మొదలైంది. జాయ్ ఫిలిం బాక్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.