పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్... ముంబయి ముందు స్వల్ప లక్ష్యం

28-09-2021 Tue 21:56
  • ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ ముంబయి
  • తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 రన్స్
  • లక్ష్యఛేదనలో ముంబయి తడబాటు
  • 16 పరుగులకే రెండు వికెట్లు డౌన్
Punjab set low target for Mumbai
ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అయిడెన్ మార్ క్రమ్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. దీపక్ హుడా 28, కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేశారు. గేల్ (1), నికొలాస్ పూరన్ (2) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 2, పొలార్డ్, రాహుల్ చహర్ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి తడబడింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు.