సమంత 'సాకీ' బిజినెస్ సక్సెస్.. ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుక

28-09-2021 Tue 21:44
  • ఆన్ లైన్ వస్త్రవ్యాపారం ప్రారంభించిన సమంత
  • సాకీ పేరిట ఈ-కామర్స్ పోర్టల్
  • ట్రెండీ దుస్తుల విక్రయం
  • ఇది సమష్టి కృషి అని పేర్కొన్న సమంత
Samantha celebrates Saaki first anniversary
నేటి సినీ తారల్లో సమంత ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం, సామాజిక సేవ చేస్తూ ముందుకు వెళుతున్నారు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. సాకీ స్థాపించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంతా వేడుక చేసుకున్నారు.

మేం ఏడాది పూర్తి చేశాం... ఇది సమష్టి విజయం అంటూ కేక్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ గంతులేశారు. సాకీ ఓ కుటుంబం వంటిదని పేర్కొన్నారు. సాకీ ఆన్ లైన్ పోర్టల్ లో ట్రెండీ దుస్తులు, ఇతర యాక్సెసరీలు విక్రయిస్తారు. అమ్మాయిలకు సంబంధించిన లేటెస్ట్ ఫ్యాషన్లను సాకీలో చూసి ఎంచుకోవచ్చు.
https://www.instagram.com/p/CUWxscBBtVr/?utm_source=ig_web_copy_link