వైసీపీ ప్రభుత్వంపై మరో 'స్నాప్ షాట్' వదిలిన పవన్ కల్యాణ్

28-09-2021 Tue 21:30
  • జగన్ సర్కారుపై కొనసాగుతున్న పవన్ విమర్శల పర్వం
  • ఇటీవల ఓ స్నాప్ షాట్ ను పంచుకున్న జనసేనాని
  • తాజాగా పాలసీ టెర్రరిజం పేరిట స్పందన
  • అనేక అంశాలను ఎత్తిచూపిన వైనం
Pawan Kalyan shares another snap shot on AP Govt
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్నాప్ షాట్ పేరిట ఏపీ సర్కారుపై తన విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ స్నాప్ షాట్ ను పంచుకున్న పవన్, తాజాగా వైసీపీ ప్రభుత్వ పాలసీ ఉగ్రవాదానికి ఉదాహరణలు అంటూ మరో స్నాప్ షాట్ విడుదల చేశారు.

వలంటీర్ల సత్కారం కోసం రూ.261 కోట్లు ఖర్చు, శ్వేతపత్రాలు, జపాన్ రాయబారి వ్యాఖ్యలు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన రూ.450 కోట్ల దారిమళ్లింపు, అమ్మకానికి ఏపీ, రివర్స్ టెండరింగ్, పోలవరం పురోగతి? రాష్ట్రంలో మౌలిక వసతుల లేమి, ఏపీని వదిలి వెళుతున్న కంపెనీలు, మోసపోయిన అమరావతి రైతులు, ప్రభుత్వం సిమెంట్ ను కూడా ఆన్ లైన్ లో అమ్ముతుందా? రుణం నిలిపివేసిన వరల్డ్ బ్యాంకు, రుణాలను ఉపసంహరించుకున్న ఏఐఐబీ, సంపద సృష్టి ఏదీ? 3 రాజధానులంటూ ప్రవచనాలు, ఉద్యోగాల లేమి, నవకష్టాలు, ఇసుక విధానం అంటూ పలు అంశాలను పవన్ సింగిల్ పోస్టు ద్వారా ఎత్తిచూపారు.