Nagarjuna: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఆశీస్సులు మాకు చాలా అవసరం: నాగార్జున

Nagarjuna says they need blessings of Telugu states
  • లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్
  • హైదరాబాదులో కార్యక్రమం
  • హాజరైన నాగార్జున
  • చిత్రబృందానికి అభినందనలు
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఇటీవల రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ చిత్రబృందం హైదరాబాదులో మ్యాజికల్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఓవైపు గులాబ్ తుపాను, మరోవైపు కరోనా... ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎంతో ప్రేమిస్తారని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దీవెనలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు తమను మంచిచూపు చూశాయని, ఇకముందు కూడా ఆ చల్లని చూపు కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు.
Nagarjuna
Andhra Pradesh
Telangana
Blessings
Love Story
Tollywood

More Telugu News