Mahesh Babu: శ్రీను వైట్ల-మహేశ్ కాంబోలో మరో సినిమా చూడబోతున్నామా?

will Srinuvaitla and Mahesh babu join hands again for a blockbuster
  • ‘దూకుడు’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన కాంబో
  • ‘ఆగడు’తో పడిపోయిన శ్రీను వైట్ల గ్రాఫ్
  • తర్వాతి మూడు సినిమాలు కూడా డిజాస్టర్లే
  • కథ చెప్పి ఒప్పిస్తానంటున్న స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో శ్రీను వైట్ల-మహేశ్ బాబు కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దూకుడు’ ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసిందే. అప్పటి వరకూ స్లో ట్రాక్‌లో ఉన్న మహేశ్ కెరీర్‌ను ఈ సినిమా టర్న్ చేసిందనే చెప్పొచ్చు. అలాగే శ్రీను వైట్లను కూడా రూ.20 కోట్ల సినిమాల నుంచి రూ.50 కోట్ల సినిమాల క్లబ్బులో చేర్చిందీ సినిమా.

అయితే వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఆగడు’ చిత్రం శ్రీను వైట్ల కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పింది. అయితే ఇది పాజిటివ్‌గా కాదు. ఆ తర్వాత శ్రీను వైట్ల తీసిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు భారీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. దీంతో మరోసారి మహేశ్-శ్రీనువైట్ల కాంబో చూడగలమా? అని అభిమానులు నిరాశలో పడిపోయారు.

అయితే వీరికి శ్రీను వైట్ల ఉత్సాహమిచ్చాడు. కచ్చితంగా మహేశ్ ‌కు కథ చెప్పి ఒప్పిస్తానని మాటిచ్చాడు. కానీ మహేశ్ ఈ స్టార్ డైరెక్టర్‌కు ఛాన్సిస్తాడా? అన్నది అనుమానమే. కాకపోతే ప్రస్తుతం మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ తీస్తున్న శ్రీను వైట్ల తన సత్తా గనుక నిరూపించుకుంటే మహేశ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు శ్రీను వైట్ల. ఈ రెంటిలో ఏది మంచి హిట్ కొట్టినా శ్రీను వైట్ల-మహేశ్ కాంబోను మరోసారి తెరమీద చూసే అవకాశం ఉంటుంది. మరి అభిమానుల కల నెరవేరుతుందా? లేదా? అని తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Mahesh Babu
Srinuvaitla
Dookudu
Aagadu
Tollywood
Cinema News

More Telugu News