ఈ నెల 30న 'అరణ్మనై 3' ట్రైలర్ రిలీజ్!

28-09-2021 Tue 18:36
  • హారర్ కామెడీగా 'అరణ్మనై 3'
  • ఆర్య జోడీగా రాశి ఖన్నా
  • సుందర్.సి దర్శకత్వం
  • అక్టోబర్ 14వ తేదీన విడుదల
Aranmanai 3 movie update

తమిళనాట హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్.సి సిద్ధహస్తుడు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన 'అరణ్మనై' .. 'అరణ్మనై 2' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. తెలుగులో 'కళావతి' .. 'చంద్రకళ' పేర్లతో వచ్చిన ఆ సినిమాలు, ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టాయి.

ఇక ఇప్పుడు సుందర్.సి 'అరణ్మనై 3' సినిమాను రూపొందించాడు. సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఆర్య - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. సత్య అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంపత్ రాజ్ .. ఆండ్రియా .. సాక్షి అగర్వాల్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు..