రేపు వెంకీ చేతుల మీదుగా 'నాట్యం' సాంగ్ రిలీజ్!

28-09-2021 Tue 18:08
  • నాట్యమే ప్రధాన ఇతివృత్తంగా సాగే కథ 
  • దర్శకుడిగా రేవంత్ కోరుకొండ 
  • కీలకమైన పాత్రలో భానుప్రియ 
  • అక్టోబర్ 22వ తేదీన విడుదల
Natyam song released by Venkatesh

సంధ్యారాజు ప్రధాన పాత్రధారిగా 'నాట్యం' సినిమా రూపొందింది. నాట్యమే ప్రధానమైన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా, సంధ్యారాజు నిర్మాణ భాగస్వామిగా ఉంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్లు .. ట్రైలర్లు ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. వెంకటేశ్ చేతుల మీదుగా రేవు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి 'పోనీ పోనీ' అనే ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. శ్రావణ్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలవనుంది.

సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో శుభలేఖ సుధాకర్ .. కమల్ కామరాజు .. రుక్మిణి విజయ్ కుమార్ కనిపించనున్నారు. అక్టోబర్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి. .