KKR: ఢిల్లీని స్వల్ప స్కోరుకు కట్డడి చేసిన కోల్ కతా బౌలర్లు

KKR bowlers restrict Delhi Capitals for a low score
  • షార్జాలో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్
  • రాణించిన పంత్, స్టీవ్ స్మిత్
  • ఫెర్గుసన్, నరైన్, వెంకటేశ్ అయ్యర్ లకు రెండేసి వికెట్లు
ఢిల్లీతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు సత్తా చాటారు. కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.

కెప్టెన్ రిషబ్ పంత్ 39, స్టీవ్ స్మిత్ 39 పరుగులతో రాణించారు. ధావన్ 24 పరుగులు చేయగా, ఇతర బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ 1, హెట్మెయర్ 4, లలిత్ యాదవ్ 0, అక్షర్ పటేల్ 0 అశ్విన్ 9 పరుగులకు అవుటయ్యారు. కోల్ కతా బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2, సునీల్ నరైన్ 2, వెంకటేశ్ అయ్యర్ 2, టిమ్ సౌథీ 1 వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో కోల్ కతా జట్టు 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ 8, వెంకటేశ్ అయ్యర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
KKR
DC
Sharjah
IPL

More Telugu News