'పుష్ప' నుంచి రానున్న ఫస్టు లుక్ పోస్టర్!

28-09-2021 Tue 17:45
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • గిరిజన యువతి పాత్రలో రష్మిక
  • ముగింపు దశలో చిత్రీకరణ
  • 'క్రిస్మస్'కి రిలీజ్ చేసే ఆలోచన  
First Look from Pushpa movie

అల్లు అర్జున్ - రష్మిక కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. అడవి నేపథ్యంలో నడిచే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందనే ఒక టాక్ వచ్చింది. ఒక వీడియోలోను ఒక ఫ్రేమ్ లో మెరిసింది. ఇక రేపు ఆమె ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 9:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఒక ప్రకటనను చేశారు.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' అనే లిరికల్ వీడియో సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ 80 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ సినిమాను 'క్రిస్మస్' కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పినప్పటికీ, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. .