గోవాలో పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు... ఫొటోలు ఇవిగో!

28-09-2021 Tue 17:17
  • నేడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు
  • గోవాలో లైగర్ షూటింగ్
  • సెట్స్ పై సంబరాలు
  • యూనిట్ సభ్యుల నడుమ కేక్ కట్ చేసిన పూరీ జగన్నాథ్
Puri Jagannadh birthday bash at Liger sets in Goa

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విజయ్ దేవరకొండతో చేస్తున్న లైగర్ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం గోవాలో ఉన్న పూరీ జగన్నాథ్... సెట్స్ పైనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. హీరో విజయ్ దేవరకొండ, చార్మీ, ఇతర యూనిట్ సభ్యుల నడుమ కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.