రేపు రవితేజ చేతుల మీదుగా 'పెళ్లి సందD' లిరికల్ సాంగ్ రిలీజ్!

28-09-2021 Tue 17:13
  • రోషన్ హీరోగా 'పెళ్లి సందD'
  • కథానాయికగా శ్రీలీల పరిచయం
  • ముఖ్యమైన పాత్రలో రాఘవేంద్రరావు
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు  
Pelli SandaD movie update

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణంకి 'పెళ్లి సందD' సినిమాను రూపొందించారు. ఆర్కే అసోసియేట్ .. ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీరవాణి బాణీలను సమకూర్చగా .. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. రాఘవేంద్రరావు ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. రేపు ఈ సినిమా నుంచి 'మధురానగరిలో' అనే మరో లిరికల్ వీడియో సాంగు రానుంది. రవితేజ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు.

కన్నడ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. శ్రీకాంత్ కెరియర్ ను మలుపు తిప్పిన ఈ టైటిల్ రోషన్ కెరియర్ కి ఎంతవరకూ  హెల్ప్ అవుతుందో చూడాలి.