Shahid Kapoor: సమంత నటనతో ప్రేమలో పడిపోయానంటున్న బాలీవుడ్ హీరో

Shahid Kappor says he fall in love with Samantha acting
  • ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో సమంత
  • సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు
  • సామ్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన షాహిద్ కపూర్
  • సమంతతో కలిసి నటించేందుకు ఆసక్తి
అందాల భామ సమంత నటనకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే! సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లలోనూ ఈ సొట్టబుగ్గల భామ తన యాక్టింగ్ టాలెంట్ తో రాణిస్తోంది. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో సమంత నెగెటివ్ ఛాయలున్న రాజీ పాత్ర పోషించింది. ఇందులో సమంత నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ కూడా స్పందించాడు.

సమంత నటనతో ప్రేమలో పడిపోయానని చమత్కరించాడు. ఈ వెబ్ సిరీస్ యావత్తు తనను బాగా ఆకట్టుకున్న అంశం సమంత నటనేనని తెలిపాడు. ఆమెతో నటించాలని కోరుకుంటున్నానని, ఇప్పుడది తన కలగా మారిందని అన్నాడు. సమంతతో కలిసి నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని షాహిద్ కపూర్ పేర్కొన్నాడు.
Shahid Kapoor
Samantha
Web Series
Bollywood

More Telugu News