Navjot Singh Sidhu: సిద్ధూ రాజీనామాపై కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Amarinder Singh response after Navjot Singh Sidhu resignation
  • పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ  
  • సిద్దూ నిలకడ లేని మనిషి అని నేను ముందే చెప్పానన్న అమరీందర్
  • పంజాబ్ లాంటి రాష్ట్రానికి ఆయన సరిపోరని వ్యాఖ్య
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ భవిష్యత్తు విషయంలో తాను రాజీ పడలేనంటూ సోనియా గాంధీకి పంపిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. సిద్ధూ రాజీనామాపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్ధూ ఒక నిలకడ లేని వ్యక్తి అనే విషయాన్ని తాను ఇంతకు ముందే చెప్పానని ఆయన ట్వీట్ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రానికి ఆయన సరిపోరని చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాకు సిద్ధూ అత్యంత సన్నిహితుడని... మన దేశానికి సిద్ధూ ప్రమాదకారి అని ఇటీవలే అమరీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా అమరీందర్ కు, సిద్ధూకు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అమరీందర్ ను సీఎం పదవి నుంచి పార్టీ అధిష్ఠానం తొలగించింది.
Navjot Singh Sidhu
Amarinder Singh
Punjab
Congress
Resign

More Telugu News