ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... ఢిల్లీపై టాస్ గెలిచిన కోల్ కతా

28-09-2021 Tue 15:40
  • షార్జాలో కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • ప్రసిద్ధ్, రస్సెల్ కు విశ్రాంతి
  • కోల్ కతా జట్టులోకి సందీప్, సౌథీ
  • ఢిల్లీ జట్టులో స్టీవ్ స్మిత్ కు స్థానం
KKR won the toss in Sharjah
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ సమయంలో వెల్లడించాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో సందీప్ వారియర్, ఆండ్రీ రస్సెల్ స్థానంలో టిమ్ సౌథీ ఆడతారని తెలిపాడు.

ఇక ఢిల్లీ జట్టులో గాయపడిన పృథ్వీ షా స్థానంలో స్టీవ్ స్మిత్ కు చోటిచ్చారు. ఆ జట్టులో ఇదొక్కటే మార్పు. నేడు ఐపీఎల్ లో జరిగే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.