Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేటి నుంచి కోడ్ అమలు

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
  • అక్టోబరు 1న నోటిఫికేషన్
  • అక్టోబరు 8న నామినేషన్లు
  • ఉపసంహరణ గడువు అక్టోబరు 13
  • నవంబరు 2న ఫలితాల వెల్లడి
Huzurabad by polls schedule released

తెలంగాణలో గత కొన్నినెలలుగా ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అక్టోబరు 30న జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఎస్ఈసీ శశాంక్ గోయల్ స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేటి నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం 305 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, ఇప్పటికే ఈవీఎంల తొలి దశ తనిఖీ చేపట్టామని వివరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి తప్పుకుని, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుండడం తెలిసిందే.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు నేడు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబరు 8 నామినేషన్ల దాఖలు ఉంటుంది. అక్టోబరు 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబరు 30న పోలింగ్ నిర్వహించి, నవంబరు 2న ఫలితాలు వెల్లడిస్తారు.

More Telugu News