TikTok: టిక్ టాక్ డీల్ ఫెయిల్.. తన కెరీర్ లో అదో వింత డీల్ అన్న సత్య నాదెళ్ల

Satya Nadella Interesting Comments On Failed Tik Tok Acquisition
  • గత ఏడాది ఆగస్టులో చర్చలు
  • అమెరికా వెర్షన్ ను వేరు చేయాలన్న నాటి అధ్యక్షుడు ట్రంప్
  • సెప్టెంబర్ నాటికి మూలకు పడిపోయిన డీల్
  • బైడెన్ సుముఖంగా ఉన్నారో లేదో తెలియదన్న సత్య  
గత ఏడాది ట్రంప్ హయాంలో టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకునేంత పని చేసింది. అయితే చివరి నిమిషంలో ఆ డీల్ రద్దయిపోయింది. ఆ డీల్ విఫలమవడంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. తాను పనిచేసిన డీల్స్ లో అదే ఓ వింత డీల్ అని అన్నారు. ఇవాళ కాలిఫోర్నియాలోని బివర్లీ హిల్స్ లో నిర్వహించిన కోడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డీల్ కుదిరితే టిక్ టాక్ లో మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్ నిపుణతను ప్రవేశపెట్టాలనుకున్నానని చెప్పారు. చాలా మంది గురించి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. తాము టిక్ టాక్ దగ్గరకు పోలేదని, వారే తమ దగ్గరకు వచ్చారని స్పష్టం చేశారు. సంస్థకు నాటి ప్రభుత్వం ప్రత్యేకించి కొన్ని విషయాలను స్పష్టం చేసిందని, దురదృష్టవశాత్తూ డీల్ కుదర్లేదని చెప్పారు.

మధ్యస్థంగా ఉండే అమెరికా విధి విధానాలు, చైల్డ్ సేఫ్టీ వంటి విషయాలే టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ సీఈవో ఝాంగ్ యిమింగ్ కు నచ్చాయన్నారు. అయితే, ఇప్పుడు జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ డీల్ కు సుముఖంగా ఉందో లేదో తనకు మాత్రం తెలియదన్నారు. ప్రస్తుతం తనకున్నదాంట్లో సంతృప్తిగా ఉన్నానని కామెంట్ చేశారు. క్రిప్టోకరెన్సీ నిబంధనలపై ప్రభుత్వ నియంత్రణకు మద్దతిస్తున్నానని చెప్పారు.

కాగా, టిక్ టాక్ టేకోవర్ కు సంబంధించి గత ఏడాది ఆగస్టులో మైక్రోసాఫ్ట్ తో బైట్ డాన్స్ చర్చలను ప్రారంభించింది. అయితే, నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అడ్డుపుల్ల వేశారు. టిక్ టాక్ అమెరికా వెర్షన్ ను బైట్ డాన్స్ నుంచి వేరు చేయాలని సూచించారు. దేశ ప్రజల సమాచార భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై ఎటూ తేలకపోవడంతో సెప్టెంబర్ నాటికి డీల్ మూలకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి నాటికి పూర్తిగా రద్దయిపోయింది.
TikTok
USA
Microsoft
Satya Nadella
Donald Trump
Joe Biden
Bytedance

More Telugu News