నిరుద్యోగులు కళ్లు ఎర్ర చేస్తే మీ ఉద్యోగాలు పోతయి జాగ్రత్త!: ష‌ర్మిల హెచ్చ‌రిక‌

28-09-2021 Tue 13:05
  • తండ్రి 50 వేల‌ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తం అంటడు
  • అల్లుశ్ హరీశ్‌ రావు 75 వేల‌ ఉద్యోగాల భర్తీ అంటడు
  • కొడుకు కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటడు
  • ఒక్క ఇంటికే మీరు మాత్రం అయిదు ఉద్యోగాలు తీసుకున్నారు
sharmila slams kcr

తెలంగాణ‌లో ఉద్యోగాల నోటిఫికేష‌న్లు విడుదల చేస్తామంటూ చాలా కాలంగా సీఎం కేసీఆర్, హ‌రీశ్ రావు చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌ల‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మండిప‌డ్డారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై బాధ్య‌త లేన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆమె ట్వీట్ చేశారు.

'తండ్రి 50 వేల‌ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తం అంటడు. అల్లుడు హరీశ్‌ రావు 75 వేల‌ ఉద్యోగాల భర్తీ అంటడు. కొడుకు కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటడు. ఒక్క ఇంటికే అయిదు ఉద్యోగాలు తీసుకొన్న మీకు నిరుద్యోగుల పట్ల భాద్యత ఉందా? ఉద్యోగాల కోసం చూస్తోన్న‌ నిరుద్యోగులు కళ్లు ఎర్ర చేస్తే మీ ఉద్యోగాలు పోతయి జాగ్రత్త!' అని ష‌ర్మిల హెచ్చ‌రించారు.