బద్వేలు ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరేనా..?

28-09-2021 Tue 12:57
  • అక్టోబర్ 30న జరగనున్న పోలింగ్
  • ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఇప్పటికే ప్రకటించిన టీడీపీ
  • వైసీపీ నుంచి దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ 
Candidates contesting in Badvel Bypolls

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. మరోవైపు ఈ ఉపఎన్నికలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో ఓబుళాపురం రాజశేఖర్ పేరును తమ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ పేరును అధికార వైసీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి గురించి తెలియాల్సి ఉంది. అక్టోబర్ 30న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.