ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన జీవీఎల్

28-09-2021 Tue 12:08
  • వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను
  • విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత ఉండాలి
  • 'నువ్వు ఒకటంటే నేను వంద అంటాను' అనే అహంకారం వ‌ద్దు
gvl slams ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు విరుచుకుప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ దీటుగా స‌మాధానం ఇస్తున్నారు. ప‌వ‌న్‌పై ఏపీ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు విమ‌ర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

'జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి' అని జీవీఎల్ న‌ర‌సింహారావు సూచించారు.