Telangana: భారీ వర్షాల కారణంగా తెలంగాణ శాసనసభ సమావేశాలు బంద్

Telangana assembly adjourns for three days amid heavy rains
  • గులాబ్ తుపాను కాణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
  • ఈరోజు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
  • మూడు రోజుల పాటు వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో గులాబ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈరోజు సెలవు ప్రకటించారు.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేశారు. మూడు రోజుల పాటు సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు శాసనసభ, శాసనమండలి కార్యాలయాలు ప్రకటించాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని బులెటిన్ లో కోరారు.

 ఈరోజు నుంచి మూడు రోజుల పాటు.. అనగా 28, 29, 30 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అక్కడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Telangana
Assebly Sessions
Gulab Cyclone
Heavy Rains

More Telugu News