సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

28-09-2021 Tue 07:38
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
  • ఆరెంజ్ అలెర్ట్ జారీ
  • గులాబ్ తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు
Heavy rains predicted in Telangana due to cyclone gulab

గులాబ్ తుపాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సహా తెలంగాణ తడిసి ముద్దయింది.  లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు, నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర తెలంగాణతోపాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.