సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-09-2021 Tue 07:37
  • సమంతపై బాలీవుడ్ హీరో పొగడ్తలు 
  • మహేశ్, రాజమౌళి ప్రాజక్ట్ అప్ డేట్ 
  • వచ్చే ఏడాది మళ్లీ 'లవ్ స్టోరీ' కాంబో    
Shahid Kapoor loves to work with Samantha

*  సమంతాతో కలసి నటించాలని ఉందంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. 'సమంత నటించిన ఫ్యామిలీ మేన్ 2 సీరీస్ చూశాను. అందులో ఆమెది అద్భుతమైన అభినయం. అవకాశం వస్తే కనుక ఆమెతో కలసి నటించాలని వుంది' అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్.
*  మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ రాస్తున్న స్క్రిప్ట్ చివరి దశలో వుంది. త్వరలోనే మహేశ్ కి రాజమౌళి ఫైనల్ స్క్రిప్టును వినిపిస్తాడని తెలుస్తోంది.
*  నాగ చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ' చిత్రం మంచి హిట్టయిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుందని నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, రామ్మెహన్ రావు తెలిపారు.