శాంసన్ మెరుపులు... రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్

27-09-2021 Mon 21:48
  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • 82 పరుగులు చేసిన శాంసన్
  • లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ కు శుభారంభం
Rajasthan Royals Vs Sunrisers Hyderabad

సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోరులో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 82 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36, లమ్రోర్ 29 పరుగులు సాధించారు. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 6 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ డకౌట్ అయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2, సందీప్ శర్మ 1, భువనేశ్వర్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

అనంతరం, 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా శుభారంభం అందించారు. రాయ్ 16, సాహా 18 పరుగులతోనూ క్రీజులో ఉండగా, సన్ రైజర్స్ జట్టు 4 ఓవర్లలో 39 పరుగులు చేసింది.