రకుల్ ప్రీత్ తాజా ఫొటో చూసి దిగ్భ్రాంతికి గురవుతున్న అభిమానులు!

27-09-2021 Mon 20:42
  • ఇన్ స్టాలో మూడ్రోజుల కిందట ఫోటో పంచుకున్న రకుల్
  • పూర్తి స్లిమ్ లుక్ లో హీరోయిన్
  • ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్న రకుల్
  • ఎవరీవిడ? అంటూ నెటిజన్ల కామెంట్లు
Rakul Preet latest pic gets negative response

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మూడ్రోజుల కిందట ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటో అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్న తమ ఆరాధ్యదేవతను చూసి నెటిజన్లు తలోరకంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖానికి చేయించుకున్న సర్జరీ కారణంగానే రకుల్ ఆ విధంగా కనిపిస్తోందని ఓ వ్యక్తి స్పందించాడు. కొందరైతే "ఎవరీవిడ?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల్లో ఒక్క మంచు లక్ష్మి మాత్రం ఈ ఫొటోపై పాజిటివ్ గా స్పందించారు. ఆమె "హాట్ నెస్" అంటూ వ్యాఖ్యానించారు.