ఏపీలో వైసీపీ, టీడీపీ కలిసిపోవడం ఆశ్చర్యంగా ఉంది: సోము వీర్రాజు

27-09-2021 Mon 17:57
  • రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్
  • పార్లమెంటులో ఈ బిల్లులకు వైసీపీ, టీడీపీ మద్దతు పలికాయన్న సోము వీర్రాజు
  • రైతుల కోసం జరిగిన బంద్ లో రైతులు పాల్గొనలేదని వ్యాఖ్య
Surprised to see YSRCP and TDP came together says Somu Veerraju
ఈరోజు జరిగిన భారత్ బంద్ కు దేశంలోని పలు పార్టీలు మద్దతు పలికాయి. ఏపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రెండూ బంద్ పాటించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. భారత్ బంద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీలు ఏకం కావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

పార్లమెంటులో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఈ రెండు పార్టీలు ఎందుకు మద్దతు తెలిపాయని ప్రశ్నించారు. రైతుల కోసం అంటూ జరిగిన బంద్ లో రైతులెవరూ పాల్గొనలేదని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. పంజాబ్, మహారాష్ట్రల్లో కొంత మంది డబ్బులు ఖర్చు చేస్తూ ఉద్యమాలు నడిపిస్తున్నారని చెప్పారు. మోదీపై నిందలు వేయడాన్నే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.