మహేశ్ ట్వీట్ ... సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సాయిపల్లవి!

27-09-2021 Mon 17:48
  • ఈ నెల 24న విడుదలైన 'లవ్ స్టోరీ'
  • రిలీజైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు
  • సినిమా చూసిన మహేశ్ బాబు  
  • సాయిపల్లవిపై ప్రశంసల వర్షం
Sai Pallavi is Happy about Mahesh Babu tweet
సాయిపల్లవి ఒప్పుకుంటే ఆ కథలో విషయం ఉన్నట్టే, ఆమె డాన్స్ చేసిందంటే, అది మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టినట్టే. కథ ఏదైనా .. దాని నేపథ్యం ఏదైనా .. సాయిపల్లవి ఉందంటే చాలు, ఆ సినిమాకి వెళ్లిపోవచ్చును అనే నమ్మకం ఆడియన్స్ లో వచ్చేసింది.

అలా తాజాగా ఆమె చేసిన 'లవ్ స్టోరీ' భారీ వసూళ్లతో .. ప్రముఖుల ప్రశంసలతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన మహేశ్ బాబు, 'అసలు ఆ వంట్లో బోన్స్ ఉన్నాయా? ఇంతవరకూ స్క్రీన్ పై అలాంటి డాన్స్ చూడలేదు' అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు.

అందుకు సాయిపల్లవి స్పందిస్తూ .. "మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్ ను ఈ పాటికే మిలియన్ టైమ్స్ చదివేసింది" అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరూ అభినందనలు మరిచిపోకముందే, మహేశ్ ప్రశంసలు ఆమెలో మరింత జోష్ ను నింపుతున్నాయి.