స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

27-09-2021 Mon 17:30
  • 29 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 2 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఆరున్నర శాతం వరకు పెరిగిన మారుతి సుజుకి షేర్ వాల్యూ
Market ends with slight profits
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, ఎనర్జీ, బ్యాంకింగ్ షేర్లు ఈజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు లాభపడి 60,077కి పెరిగింది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 17,855 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (6.53%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.14%), బజాజ్ ఆటో (2.77%), ఎన్టీపీసీ (2.09%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.70%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.58%), టెక్ మహీంద్రా (-3.30%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.64%), ఇన్ఫోసిస్ (-2.35%), ఎల్ అండ్ టీ (-1.58%).