'కొండ పొలం' నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

27-09-2021 Mon 17:21
  • క్రిష్ తాజా చిత్రంగా 'కొండ పొలం'
  • గిరిజన ప్రాంతంలో నడిచే కథ
  • వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ 
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల
Konda Polam trailer released

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ 'కొండ పొలం' సినిమా చేశాడు. 'కొండ పొలం' అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాజీవ్ రెడ్డి - సాయిబాబు నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా రకుల్ కనిపించనుంది. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఆయన తండ్రి పాత్రలో సాయిచంద్ .. తాత పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. తాము ఉన్న చోటున గొర్రెలను మేపుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో, కొండపొలం చేసుకోవడానికి వెళతారు.

అక్కడ వాళ్లకి క్రూరమృగాలతో పాటు అంతకంటే భయంకరమైన మనుషుల వలన సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు కథానాయకుడు మృగాలపైనే కాదు .. మానవత్వంలేని మనుషులపై కూడా తిరగబడతాడు. కథాకథనాలు కొత్తగా అనిపిస్తున్నాయి. అక్టోబర్ 8 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.