విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో నటిస్తున్న మైక్ టైసన్

27-09-2021 Mon 16:30
  • తెలుగు తెరపై బాక్సింగ్ యోధుడు
  • టైసన్ పై సన్నివేశాలను చిత్రీకరించనున్న లైగర్ టీమ్
  • లైగర్ లో ఫైటర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ
Mike Tyson on board for Vijay Devarakonda Liger movie

మైక్ టైసన్... ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ అమెరికా యోధుడు ఇప్పుడు తెలుగు సినిమా తెరపై కనువిందు చేయనున్నాడు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న లైగర్ చిత్రంలో మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. భారతీయ వెండితెరపై మైక్ టైసన్ ఓ సినిమాలో నటించడం ఇదే తొలిసారి అని తెలిపింది. నమస్తే టైసన్ అంటూ స్వాగతం పలికింది. లైగర్ చిత్రం కోసం టైసన్ పై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక.