సిరియా అధ్యక్ష భవనం వద్ద అందరూ చూస్తుండగా ఆత్మాహుతి దాడి... భయానక వీడియో ఇదిగో!

  • సిరియాలో ఉగ్రబీభత్సం
  • అధ్యక్ష భవనం వద్ద ఘటన
  •  ఉగ్రవాదిని పట్టుకునే ప్రయత్నం చేసిన అధికారులు
  • తనను తాను పేల్చుకున్న ఉగ్రవాది
  • ముగ్గురి మృతి
Fatal suicide attack at Syria presidential complex

సిరియాలో ఉగ్రబీభత్సం నెలకొంది. దేశాధ్యక్షుడు అసద్ భవనం వద్ద ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఆత్మాహుతి దళ సభ్యుడు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే అతడు తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు కారణంగా శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఆత్మాహుతి దళ సభ్యుడితో పాటు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు భద్రతా అధికారులు కూడా మృతి చెందారు.

More Telugu News