Narco Test: వివేకా హత్య కేసులో కీలక పరిణామం... నార్కో పరీక్షలకు అంగీకరించిన నిందితుడు మున్నా

  • మున్నాకు నార్కో పరీక్షలపై సీబీఐ పిటిషన్
  • మేజిస్ట్రేట్ ఎదుట సమ్మతి తెలిపిన మున్నా
  • మున్నాకు నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి
  • త్వరలో మున్నాను గుజరాత్ కు తీసుకెళ్లనున్న సీబీఐ అధికారులు
Narco tests for Munna in Viveka murder case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న మున్నా నార్కో పరీక్షలకు అంగీకరించాడు. మేజిస్ట్రేట్ ఎదుట తన సమ్మతి తెలిపాడు. దాంతో పులివెందుల కోర్టు అతడికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది. నార్కో పరీక్షలు నిర్వహించేందుకు గాను మున్నాను సీబీఐ అధికారులు త్వరలో గుజరాత్ కు తీసుకెళ్లనున్నారు.

వివేకా హత్య కేసు తర్వాత పులివెందులలోని ఓ బ్యాంకులో మున్నాకు చెందిన లాకర్ లో రూ.40 లక్షలకు పైగా నగదు గుర్తించారు. మున్నా పులివెందులలో ఓ చెప్పుల షాపు యజమాని. అయితే, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరితో మున్నా సంబంధాల నేపథ్యంలో సీబీఐ అతడిపైనా విచారణ చేపట్టింది.

More Telugu News