Prakash Raj: మొదలైన నామినేషన్ల పర్వం.. నామినేషన్‌ వేసిన ప్రకాశ్‌ రాజ్‌ అండ్‌ టీమ్

Prakash Raj and team files nomination for MAA elections
  • ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాల అందజేత
  • రేపు నామినేషన్ వేయనున్న మంచు విష్ణు
  • అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. 'మా' అధ్యక్ష అభ్యర్థిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ వేశారు. అయనతో పాటు ఆయన ప్యానల్ లో ఉన్న సభ్యులందరూ నామినేషన్లు వేశారు. 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు వీరంతా నామినేషన్ పత్రాలను అందజేశారు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోని సభ్యులు వీరే:
  • అధ్యక్షుడు - ప్రకాశ్‌రాజ్‌
  • ఉపాధ్యక్షులు - బెనర్జీ, హేమ
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్
  • జనరల్ సెక్రటరీ - జీవితా రాజశేఖర్
  • ట్రెజరర్ - నాగినీడు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జాన్.

మరోవైపు మంచు విష్ణు రేపు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ  నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Prakash Raj
MAA Elections
Nomination
Panel
Tollywood
Manchu Vishnu

More Telugu News