Allu Arjun: అందమైన లొకేషన్లో సాంగ్ షూట్ కి సిద్ధమైన 'పుష్ప'

Pushpa song shoot was done at beautiful location
  • ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్
  • త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్
  • చిత్రీకరణ దశలో మరో సాంగ్
  • 'క్రిస్మస్'కి భారీస్థాయి విడుదల      

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ప్రస్తుతం ఓ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఆ లొకేషన్ .. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. షూటింగ్ స్పాట్ లో వేసిన టెంట్ ..  కారవాన్లు .. ప్రొడక్షన్ వ్యాన్లు అక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు .. పచ్చని ప్రకృతి .. నిండుగా ప్రవహిస్తున్న నదీ .. ఆ నదీ తీరంలో ఈ పాట చిత్రీకరణను ప్లాన్ చేసినట్టుగా ఈ ఫొటోను బట్టి తెలుస్తోంది.

అల్లు అర్జున్ లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించగా, 'తగ్గేదే లే' అనే డైలాగ్ చాలా పాప్యులర్ అయింది. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు సింగిల్ కొత్త రికార్డులకు సరికొత్త అర్థం చెప్పింది. త్వరలోనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. 'క్రిస్మస్' కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News