Putin: సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో పుతిన్‌.. సెర్బియా ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం!

Russian president Putin in self isolation
  • కరోనా బారిన పడిన పలువురు పుతిన్ సహచరులు
  • చేపలు పట్టడం, అడ్వెంచరస్ డ్రైవింగ్ వంటివి చేస్తున్న పుతిన్
  • గతంలో కూడా ఐసొలేషన్ లో ఉన్న రష్యా అధ్యక్షుడు
రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌ సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఆయన సహచరుల్లో అనేక మంది కరోనా బారిన పడ్డారు. దీంతో, ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లారు. సెర్బియా ప్రాంతంలో ఆయన ఐసొలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐసొలేషన్ సమయంలో ఆయన అక్కడే ఉన్న నీటి ప్రవాహంలో చేపలు పట్టడం, అడ్వెంచరస్ డ్రైవింగ్ వంటివి చేస్తున్నారు.

ఈ విషయాన్ని అధ్యక్షుడి అధికార నివాస భవనం క్రెమ్లిన్ తెలియజేసింది. అధ్యక్షుడి ఫొటోలను కూడా షేర్ చేసింది. గతంలో కూడా పుతిన్ ఐసొలేషన్ లో ఉన్నారు. ఆ సమయంలో విపరీతమైన చలిలో కూడా ఆయన ఈత కొడుతూ, హార్స్ రైడింగ్ చేస్తూ గడిపారు.
Putin
Russia
Self Isolation

More Telugu News