Chiranjeevi: 'గాడ్ ఫాదర్' సినిమాతో సీనియర్ హీరోయిన్ శోభన రీ ఎంట్రీ!

God Father movie upadate
  • నిన్నటి తరం హీరోయిన్ గా క్రేజ్
  • గతంలో చిరూ జోడీగా సినిమాలు  
  • కొంతకాలంగా నటనకి దూరం
  • మంజు వారియర్ చేసిన పాత్ర కోసం అంటూ టాక్
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఆ మధ్య మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'లూసిఫర్'కి ఇది రీమేక్. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లింది. చరణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం.

కుటిల రాజకీయాలను టచ్ చేస్తే సాగే కథ ఇది. ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. కథలో చోటుచేసుకునే ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాంటి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ 'శోభన'ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. మలయాళంలో మంజు వారియర్ చేసిన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.

తెలుగులో కథానాయికగా శోభన ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి సరసన కథానాయికగా 'రుద్రవీణ', 'రౌడీ అల్లుడు' సినిమాలు చేసింది. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమె, 2006లో మంచు విష్ణు హీరోగా చేసిన 'గేమ్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.
Chiranjeevi
Sobhana
Sathyadev

More Telugu News