భారత్ బంద్ ఎఫెక్ట్.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల నిలిపివేత

27-09-2021 Mon 09:47
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల బంద్
  • బంద్‌కు సంఘీభావం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • 12 గంటల తర్వాతే ఏపీకి బస్సులు నడపనున్న తెలంగాణ
TS RTC Halts Bus Services to Andhrapradesh due to Bharat bandh
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ బస్సులు చాలా వరకు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. బంద్‌కు సంఘీభావంగా మధ్యాహ్నం 12 వరకు ఏపీ ప్రభుత్వం బస్సులను నిలిపివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 గంటల తర్వాతే ఏపీకి బస్సులు నడపాలని నిర్ణయించారు. హన్మకొండ, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బస్సులు నిలిచిపోగా, కొన్ని జిల్లాల్లో మాత్రం బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.