రాణించిన కోహ్లీ, మ్యాక్స్ వెల్, భరత్.... బెంగళూరు భారీ స్కోరు

26-09-2021 Sun 21:34
  • ముంబయి ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 రన్స్
  • మ్యాక్స్ వెల్, కోహ్లీ అర్ధసెంచరీలు
RCB set huge target to Mumbai Indians

ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సులు), శ్రీకర్ భరత్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది.

ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (0) విఫలమైనా, కెప్టెన్ కోహ్లీ... ఆంధ్రా ఆటగాడు భరత్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు ఉరికించాడు. మిడిలార్డర్ లో మ్యాక్స్ వెల్ కూడా ధాటిగా ఆడడంతో బెంగళూరు స్కోరు 150 దాటింది. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, బౌల్ట్ 1, మిల్నే 1, రాహుల్ చహర్ 1 వికెట్ పడగొట్టారు.