Avanthi Srinivas: పెద్దలు చిరంజీవి, మోహన్ బాబులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదు: మంత్రి అవంతి

Avanthi condemns Pawan Kalyan comments on Chiranjeevi and  Mohan Babu
  • రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఆవేశపూరిత ప్రసంగం
  • ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేనాని
  • ఘాటుగా బదులిస్తున్న మంత్రులు
  • తాజాగా అవంతి స్పందన
ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ మంత్రులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. సీఎం, మంత్రులపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని అన్నారు.

సినిమా గురించి మాట్లాడాల్సిన చోట రాజకీయాలు మాట్లాడిన పవన్... సినిమా వేదికను రాజకీయంగా మార్చారని విమర్శించారు. పవన్ నిన్నటి సభలో పెద్దలు చిరంజీవి, మోహన్ బాబులపై మాట్లాడిన తీరు సరికాదని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు.

తమ ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం సినీ పరిశ్రమకు నష్టం జరుగుతుందని ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానంపై పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఓ పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు.
Avanthi Srinivas
Pawan Kalyan
Chiranjeevi
Mohan Babu

More Telugu News