దిల్ రాజు గారూ... మీరు రెడ్లు అని ఇప్పటివరకు నాకు తెలియదు: పేర్ని నాని

26-09-2021 Sun 18:09
  • పేర్ని నాని ప్రెస్ మీట్
  • దిల్ రాజు, పవన్ ను కలిపి వ్యాఖ్యలు
  • వకీల్ సాబ్ నేపథ్యంలో వివరణాత్మక విమర్శలు
  • సీఎం జగన్ అడ్డుకుంటే ఇన్ని కోట్ల షేర్ ఎలా వచ్చిందంటూ ఆగ్రహం
Perni Nani comments on Dil Raju and Pawan Kalyan
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు. నిన్న రిపబ్లిక్ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి, దిల్ రాజు రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఘాటైన పదజాలంతో స్పందించారు.

"దిల్ రాజు గారూ మీరు రెడ్లు అని నాకు తెలియదు. మీరు రాజులే అనుకున్నాను. మా జగన్ కూడా మీరు రాజులే అనుకుని మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నట్టున్నారు. నువ్వు రెడ్డి అని చెప్పవయ్యా... నీకు ఫేవర్ గా ఉంటాడు... అంటూ మావాడు నిన్న రిపబ్లిక్ ఈవెంట్లో అంటుంటే పాపం దిల్ రాజు రెడ్డి బిక్కచచ్చిపోయాడు. మా పవన్ గాడు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే రాజు గారి ముఖం ఏడవలేక నవ్వుతున్నట్టుంది. ఆయన బాధలు ఆయనవి.

దొంగ బాధకంటే లింగ బాధ పడలేకపోతున్నామన్నట్టుగా ఉంది. దొంగను తరుముతూ వెళుతుంటే మెడలో కట్టుకున్న లింగం గుండెలపై కొట్టుకుంటుంటే దొంగ బాధ కంటే లింగ బాధ ఎక్కువగా ఉందని బాధపడ్డాడట వెనకటికి ఎవడో. దిల్ రాజు రెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సినిమా టికెట్లు, నిబంధనల సంగతేమో కానీ ఈ పీకే గాడు లింగంలా తయారయ్యాడని దిల్ రాజు రెడ్డి అనుకుంటున్నట్టుంది. నిన్న ఆయన ముఖం చూస్తే ఆముదం తాగినట్టుగా అనిపించింది" అంటూ వ్యంగ్యం కురిపించారు.

"ఇక, వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెబుతున్నారు. వకీల్ సాబ్ చిత్రంపై దిల్ రాజు రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల షేర్ వచ్చింది. అందులో ఏపీ వాటా రూ.55.60 కోట్లు అయితే, తెలంగాణలో వచ్చింది రూ.25.37 కోట్లు. ఏరా దిక్కుమాలిన వెధవా... ఎందుకీ తప్పుడు మాటలు? ఒక్కరోజన్నా దిల్ రాజు రెడ్డి గారిని టీకి పిలిచి నాకు ఎంత ఇచ్చావ్ నీకు ఎంతయింది, నీకు ఎంతొచ్చింది అని అడిగితే లెక్క చెబుతాడు కదా. వకీల్ సాబ్ ను సీఎం జగన్ అడ్డుకుంటే ఇన్ని కోట్ల షేర్ ఎలా వచ్చింది?" అని పేర్ని నాని మండిపడ్డారు.