మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌కు పితృవియోగం

26-09-2021 Sun 16:15
  • పార్థివ్ తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌‌చంద్ర కన్నుమూత
  • బ్రెయిన్ హామరేజ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించిన మాజీ క్రికెటర్
  • సచిన్ టెండూల్కర్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ సంతాపం
Former India cricketer Parthiv Patels father passes away
టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పార్థివ్ తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ కన్నుమూశారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 2019 నుంచి తన తండ్రి బ్రెయిన్ హామరేజ్‌తో బాధపడుతున్నట్లు పార్థివ్ తెలిపాడు.

తండ్రి మరణ వార్తను ట్వీట్ చేసిన పార్థివ్.. ‘‘అత్యంత బాధతో వెల్లడిస్తున్నా.. మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ 2021 సెప్టెంబరు 26న స్వర్గస్తులయ్యారు. ఆయన్ను మీ ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉంచుకోవాలని కోరుతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అంటూ పోస్టు చేశాడు.

పార్థివ్ తండ్రి మృతికి మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ సంతాపం తెలిపారు. పార్థివ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నప్పటి నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పార్థివ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సానుభూతి తెలిపారు.