ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... చెన్నైపై టాస్ గెలిచిన కోల్ కతా

26-09-2021 Sun 15:20
  • తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ కోల్ కతా
  • రెండో మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ ముంబయి
  • చెన్నైపై టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • చెన్నై జట్టులో బ్రావో స్థానంలో శామ్ కరన్
KKR won the toss against Chennai
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుండగా, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ పోటీపడనున్నాయి.

కాగా, చెన్నైతో మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఓ మార్పు చేశారు. డ్వేన్ బ్రావో స్థానంలో శామ్ కరన్ ను తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. అదే సమయంలో, కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ సందర్భంగా తెలిపాడు.